ప్రభుత్వ కార్యాలయాలకు ఆసుపత్రి భవనాలను కేటాయిస్తే ఉద్యమం తప్పదు: కిరణ్ రాయల్

తిరుపతి మెటర్నటీ హాస్పిటల్ లో ఇప్పటికే గదులు చాలక పేషెంట్లు, అటెండెంట్లు ఇబ్బంది పడుతుంటే… జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి భవనాలు కేటాయించాలనుకోవడాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తోందని, రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు కలవరపెడుతున్నాయి. అయితే తాజాగా హాస్పిటల్ కు చెందిన భవనాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలకు కేటాయించాలని ప్రయత్నించడాన్ని జనసేన తప్పుబడుతోంది. భవనాలు ఖాళీగా ఉంటే ఆ భవనాల్లో పేషెంట్ల సహాయకులకు వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. చెట్ల కింద ఎండలో పేషెంట్ల సహాయకులు అనేక అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిని ఆస్పత్రి అవసరాలకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. నూతనంగా ఏర్పాటు చేసిన పద్మావతీ నిలయంలోని కలెక్టరేట్ లో గదులు ఖాళీగా ఉన్నా… పేదల కోసం నిర్మించిన హాస్పిటల్ లో కార్యాలయం కేటాయించాలనుకోవడం దారుణమని.. ఆస్పత్రి భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయిస్తే జనసేన ప్రత్యక్ష పోరాటానికి దిగి…. పేద రోగుల పక్షాన నిలుస్తుందని తెలియజేస్తున్నామని తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ అన్నారు.