తొలి తెలుగు అశోక చక్ర ప్రదాత విశాఖ సౌర్య దీపికా కీ.శే. కరణం వరప్రసాద్ స్మరిస్తూ మెగా వైద్య శిబిరం

విశాఖ, భారతమ్మ ముద్దు బిడ్డ తొలి తెలుగు అశోక చక్ర ప్రదాత విశాఖ సౌర్య కీ.శే. కరణం వరప్రసాద్ 9వ వర్ధంతి సందర్భంగా స్టూడెంట్ ఫౌండేషన్ ఫర్ సొసైటీ మరియు కరణం వరప్రసాద్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్స్ విశాఖపట్నం వారి సౌజన్యం తో ఉచిత మెగా మెడికల్ క్యాంపు కుటుంబ సభ్యులు అభ్యర్థన మేరకు ఉచిత మెగా మెడికల్ క్యాంపు మార్టూరు గ్రామం, అనకాపల్లి మండలం లో ఏర్పాటుచేయడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్స్ వారి పూర్తిసహాయ సహకారం తో 200 మందికి ఉచితంగా ఈసీజీ, రక్త పరీక్షలు, బీపీ, షుగర్, పరీక్షలు చేసి వాటికీ అనుగుణంగా ఉచిత మందులు పంపినణి చేయడం జరిగింది. వరప్రసాద్ దేశానికీ చేసిన సేవలను గుర్తుంచుకుంటూ ప్రతి సంవత్సరం విశాఖ జిల్లాలో పలు సేవాకార్యక్రమాలు చేస్తున్నారని, ఇంకా ఎక్కువగా సేవాకార్యక్రమాలు వరప్రసాద్ ఆశయాన్ని ప్రజలకి తీసుకొని వెళ్తున్నారని గ్రామ ప్రజలు కుటుంబసభ్యులుని అభినందించారు.