తుని పట్టణంలో వృద్ధులు, యాచకులకు అన్నదానం

తుని, మెగా పవర్ స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకలను తునిలో జనసైనికులు ఘనంగా నిర్వహించారు. తుని పట్టణంలో వృద్ధులు, యాచకులకు అన్నదానం నిర్వహించారు. అభిమాన హీరో పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో తృప్తిని ఇచ్చిందని మెగా అభిమానులు తెలిపారు. ఆకలితో ఉన్నవారికి కాస్త అన్నం పెట్టడమే తమ హీరోలు తమకు నేర్పించిన గొప్ప లక్షణమని చెప్పారు. తుని ఫ్లైఓవర్, ఆర్టీసి బస్ కాంప్లెక్స్ తదితర చోట్ల మెగా అభిమానులు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు.