ఆప్ సబ్ కి ఆవాజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

విశాఖ, సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సత్తివానిపాలెం గ్రామంలో ఆప్ సబ్ కి ఆవాజ్ సౌలభ్యంతో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 1500 గడపలు ఉన్న సత్తివానిపాలెం ప్రాంతంలో ఈ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉందని, మూడవసారి ఇక్కడ విజ్ఞాన్ కాలేజ్ వారు నిర్వహించడం ఈసారి అప్ సబ్ కి అవాజ్ వారు కలిసి నిర్వహించడం వీరికి క్వీన్స్ ఎన్నారై హాస్పిటల్ సహకరించడం ఈ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉందని ఆ గ్రామ యూత్ ప్రెసిడెంట్ ఓమ్మి అప్పలరాజు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నారై హాస్పిటల్ టి.చంద్రమౌళి సి.ఈ.ఓకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ఉచిత వైద్య శిబిరంలో ముఖ్య అతిధులుగా 88వ వార్డు కార్పొరేటర్ మీల్లి ముత్యాల నాయుడు పాల్గొని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు, తమ సతివాణిపాలెం గ్రామంలో అనేకమంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విజ్ఞాన్ యాజమాన్యం అలానే ఆప్ సబ్ కి ఆవాజ్ సమస్త యాజమాన్యాన్ని ప్రశంసించారు. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ టెక్నాలజీ ప్రిన్సిపల్ వై.శ్రీనివాస్ రావు ఉచిత వైద్య శిబిరం వెనకబడిన గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమని వాళ్లు కార్పొరేట్ హాస్పిటల్స్ లో వారు ట్రీట్మెంట్ చేయించుకోలేక వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోలేక వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు వారికి ఈ ఉచిత వైద్య శిబిరం ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు అలానే విజ్ఞాన్ కాలేజ్ వారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా వెనబడిన గ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని భరోసా కల్పించారు మరియు పవన్ కళ్యాణ్ గారు హక్వాడ్ యూనివర్సిటీ వారితో కలిసి ఉద్దానంలో కిడ్నీ సమస్యలు అందరికీ తెలియజేసి అక్కడ సహాయ కార్యక్రమాలు చేసినట్టే మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్నాము అని తెలియజేశారు. ఎన్. యస్. యస్ కోఆర్డినేటర్ డాక్టర్. ఎస్. సత్యలక్ష్మి గారు విజ్ఞాన్ కాలేజ్ నుంచి చాలా గ్రామాల్లో తన సేవలు అందించారని వారి కాలేజీ పది కిలోమీటర్ల ప్రాంతంలో వెనకబడిన గ్రామాలు 7 గ్రామాలు గుర్తించి అనేక రకాల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు ఆవిడ చేసిన సేవలో ఎంతోమంది ప్రజలు వైద్య పరంగా సహాయ సహకారాలు అందుకున్నారని ఆనందంగా ఉందని ఆవిడ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆప్ సబ్ కి అవాజ్ ఫౌండర్ సెక్రెటరీ కిరణ్ కుమార్ బావిశెట్టి మాట్లాడుతూ తమ సంస్థ దివ్యాంగుల వైస్ చైర్మన్ కర్రీ దినేష్ విహార్ గారు తోడ్పాటుతో విజ్ఞాన్ కాలేజ్ తో ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పేద ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉందని ఎన్నారై హాస్పిటల్ వారు డాక్టర్లు అలాగే వైద్య పరికరాలు మెడిసిన్స్ సహకారం అందించారని తెలియజేశారు. వారి సమస్త ఆప్ సబ్ కి అవాజ్ బడుగు బలహీన వర్గాల అలానే వెనకబడిన గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కరణం కళావతి గారు మారుమూల గ్రామాల్లో అనేక రకమైన వైద్య సమస్యలు ఉన్నాయని వాటి నుంచి బయట పడేందుకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతో అవసరం అని తెలియజేశారు ఈ యొక్క వైద్య సమస్యలు రావడానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంపెనీల ద్వారా చెడు వాయువుల ద్వారా ప్రజలకు వ్యాపిస్తున్నాయని వీటిని అరికట్టాలనివిన్నవించుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ముందుకు వచ్చి ఇలాం టి సేవా కార్యక్రమాలు చేయడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉందని ఆవిడ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆప్ సబ్ కి అవాజ్ పేటర్న్ వీరేశ్వర రావు, ఆప్ సబ్ కి అవాజ్ జాయింట్ సెక్రెటరీ కొండేటి భాస్కర్, ఆప్ సబ్ కి ఆవాజ్ మెంబర్ రవితేజ పాల్గొన్నారు.