జనసేన పార్టీ కార్యాలయంలో అలువాలా పవన్ జన్మదిన వేడుకలు

ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ అలువాలా పవన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపల్లి వెంకట్, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు పున్నం రాంబాబు, ప్రధాన కార్యదర్శి కుమార స్వామి, మీసాల మహేష్, రామలింగం, సతీష్, అరుణ్, విక్రమ్, సురేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.