చిట్టత్తూరు హరిజనవాడ గ్రామంలో నో మై కాన్స్టిట్యుఎన్సి కార్యక్రమం

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన నో మై కాన్స్టిట్యుఎన్సి కార్యక్రమం తొట్టంబేడు మండలం, చిట్టత్తూరు హరిజనవాడ గ్రామంలో జరిగింది. గ్రామంలో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా డ్రైనేజీ కాలువలు లేవు, ఇళ్ళ స్థలాలు స్మశాన వాటికలో ఇవ్వడం, త్రాగు నీరు సరిగా లేకపోవడం, చదువుకున్న యువతకి ఉద్యోగాలు లేవు, అమ్మ వడి పథకం అర్హులైన చాలా మందికి అందలేదు, తదితర సమస్యలను వినుత దృష్టికి తీసుకుని వచ్చారు. సమస్యలను మండల అధికారులకు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి ప్రజలకు న్యాయం జరిగేలా, సమస్యల పరిష్కారం కొరకు జనసేన పార్టీ పోరాడుతుందని శ్రీమతి వినుత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి, నాయకులు మున్న, కరీం, ప్రమోద్, నితీష్ కుమర్, చందు చౌదరి, తేజా, రఫీ, వినోద్, కిషోర్ రెడ్డి, జనసైనికులు శ్రావన్, శివ, గణేష్, నాగరాజు, మధు తదితరులు పాల్గొన్నారు.