జగనన్న కాలనీలలో అమలాపురం జనసేన డిజిటల్ క్యాంపెయిన్

అమలాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న కాలనీలలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా అమలాపురం రూరల్ మండలం, ఈదరపల్లి గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో శనివారం జగనన్న కాలనీ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పక్కన శ్మశానం పక్కన ఇళ్లు కేటాయించడం జరిగినది, గట్టిగా వర్షం వస్తే ముంపుకు గురి అవతున్నాయి. ఈ స్థలం ఫిషర్ మాన్ సొసైటీకి సంబందంచినది అని చెబుతున్నారు, ఇళ్లు నిర్మించడానికి అవరోధంగా మారిందని లబ్దిదారులు వాపోతున్నారు. అలాగే శనివారం అమలాపురం తాండవపల్లి, అల్లవరం మండలం బొడస్కుర్ గ్రామం, ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామం, వాడపర్రు గ్రామం పల్లెలలో జగనన్న కాలనీలను సందర్శించడం జరిగింది. ప్రతిచోట ఏదో సమస్యతో లబ్ధిదారులు ఇప్పటికీ ఇల్లు కట్టుకోవడానికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఉండడం అక్కడ చూస్తే కనబడింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లింగోలు పండు, ఏడిద శ్రీను, ఆకుల సూర్యనారాయణ మూర్తి, కొప్పుల నాగమానస, ఆర్.డి.ఎస్ ప్రసాద్, పడాల నానాజీ, బట్టు పండు, నల్లా వెంకటేశ్వర రావు, నిమ్మకాయల రాజేష్, అల్లాడి రవి, డి.ఎస్.ఎన్ కుమార్, వర్రే శేషు, కరీముళ్ళా బాబా, సాధనాలమురళి, గుండుమోగుల శ్రీనివాస్, నార్ని నాని, పెదమల్లు మణికంఠ, కొఠారి ఏసు, తిక్కిరెడ్డి వెంకటేష్, నాగులపల్లి సాయి తదితరులు పాల్గొన్నారు.