7వ డివిజన్ నందు ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

విజయవాడ, 7వ డివిజన్. జనసేన పార్టీ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని 7వ డివిజన్ లో అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ 7వ డివిజన్ అధ్యక్షురాలు శ్రీమతి దోమకొండ మేరి హాజరవడం జరిగింది.
మరియు 7వ డివిజన్ ఉపాధ్యక్షులు పెళ్లూరి ఉమామహేశ్వర రావు, సాది రెడ్డి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు పెందుర్తి విజయ్, గుత్తవల్లి పవన్ సూరి, కూరగంటి భాగ్యరాజ్, బండి ప్రదీప్, మొగదల సుజాత, అనిల్ కార్యదర్శులు బండారు విజయ్, సుజాత, జాగరపు కార్తీక్, కోన రాజు, పెందుర్తి ప్రశాంతి, సాయి బ్రహ్మాజీ, సాయి, కార్తీక్, జనసేన పార్టీ నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి 7వ డివిజన్ తరపున ఘన నివాళులు అర్పించడం జరిగింది.

అంబేద్కర్ జయంతి కార్యక్రమాలలో భాగంగా.. 7వ డివిజన్ లో జనసేన పార్టీ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు మొక్కలు పంపిణీ చేయడం జరిగింది.

అదేవిధంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమాలలో భాగంగా.. జనసేన పార్టీ నాయకులు శ్రీ దోమకొండ అశోక్ గారి ఆధ్వర్యంలో 7వ డివిజన్ లో జనసేన పార్టీ కోసం కష్టపడి పని చేసే వారిని గుర్తించి వారికి చిరు సత్కారం చేయడం జరిగింది.