బత్తుల వ్యవసాయ క్షేత్రంలో ముగిసిన రాజశ్యామల యాగం

రాజానగరం: శ్రీ శతకుండాత్మక, మహారుద్ర, శతసహస్ర మహాచండీ సహిత శ్రీ రాజశ్యామల యాగంలో భాగంగా సోమవారం శుక్లపక్షంతో కూడిన పౌర్ణమి ఘడియలు ఉన్నాయి మరియు కార్తీక మాసంలో రె౦డర సోమవారం అత్యంత పవిత్రంగా భక్తులు భావిస్తారు. నేటితో మహాయాగం సంపూర్ణం అవుతుంది. ఇందులో భాగంగా శ్రీ వినాయకపూజ, శ్రీ పుణ్యాహవచనం, శ్రీ పంచగవ్యం, యజమానసంకల్పం, సోమకుంభ పూజ, షోడశ మాతృకపూజ (నంది, గోదానం), భూత శుద్ధి, మండల పూజ, బలిదానం, 109 కుండాలలో సప్తశతి తీర్దదశ అధ్యాత్మ హోమం, శ్రీ నవశక్తి హోమం, శ్రీ దేవి మహాత్మ పారాయణ, సౌభాగ్య దివ్య సమర్పణం, వసుధారా స్తుతి, పూర్ణాహుతి, కాదంబరి బలిపూజ, శ్రీ భైరవ బలిపూజ నిర్వహించడం జరిగింది. కార్తీకమాసం రెండవ సోమవారం మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన పర్యదినం సందర్భాన్ని పురస్కరించుని జనసేన పార్టీ రాజానగరం ఇంఛార్జ్ శ్రీ బత్తుల బలరామక్రిష్ణ, వారి సతీమణి శ్రీమతి బత్తుల వెంకటలక్షి దంపతులు వారి వ్యవసాయ క్షేత్రంలో 18 అడుగుల మహా శివలింగానికి 5000 లీటర్ల పంచామృతాభిషేకాలతో మహాభిషేకాన్ని గావించడం, క్షీర, ఫలరసాల, మారేడు దళాల, భస్మ, పుష్పాలతో అభిషేకించిన తరువాత గజమాలతో స్వామిని అలంకరించడం, ఈ అశేష భక్త జనావళి హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంలో నినదిస్తుంటే స్వామి సన్నిధి నమఃశివాయ జపంతో గంభీరంగా నూరిపోయింది. ఉపచారం మరియు మహాదీపారాధన, సుమంగళీ పూజ, కన్యకాపూజ మున్నగు కార్యక్రమాలలో ఈ మహాయాగం సంపూర్ణమవుతుంది.