జనసేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు

అమలాపురం: భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ 132వ జయంతిని అమలాపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక జనసేన పార్టీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు డి.యం.ఆర్.శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అంబేడ్కర్ చిత్ర పటానికి పులమాలాంకృతం చేసి, వందన గీతం పాడి జయంతి వేడుకలను ప్రారంభించారు. తదుపరి విచ్చేసిన దళిత బడుగు బలహీన వర్గాల నాయకుల మద్య 132వ జయంతి కేక్ కట్ చేసారు . అనంతరం జరిగిన సభకు మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను అధ్యక్షత వహించగా, సభా నిర్వహణ దళిత ఉద్యమ నేత ఇసుకపట్ల రఘుబాబు చేపట్టారు. అంబేడ్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తూ సమాజ సేవలో భాగమైన దళిత నాయకులు డి.బి.లోక్, మోకాటి నాగేశ్వరరావు, యస్.యస్.ఆర్.భూపతి, అమలదాసు బాబురావు, పుణ్యమంతుల రజనీ దుశ్శాలువాతో సత్కరించి, డా. బి.ఆర్.అంబేడ్కర్ జీవితకాల పురస్కారాన్ని ముఖ్య అతిధి డి.యం.ఆర్.శేఖర్ చేతుల మీదుగా అందించారు. అనంతరం డి.యం.ఆర్.శేఖర్ మాట్లాడుతూ అంబేడ్కర్ యొక్క ఆశయాలను, సిద్ధాంతాలను గౌరవిస్తూ రాజకీయ పార్టీని నడుపుతున్న అతి కొద్దిమంది నాయకుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముందుంటారని, అలాగే కోనసీమకి డా.బి.ఆర్.అంబేడ్కర్ పేరును పెట్టడానికి ముందుగా జనసేన పార్టీ జిల్లా కార్యవర్గం మద్దతు తెలిపి తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంలో గుర్తుచేశారు. అణగారిన వర్గాలు, ఇప్పటి వరకూ రాజ్యాధికారం పొందని వర్గాలకు మంచి జరగాలి అంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తేనే జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో మనం అంతా మరింత బలంగా పని చేసి జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని డి.యం.ఆర్. ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వేంకటేశ్వర రావు, గౌరవ అతిథులుగా 4వ వార్డు కౌన్సిలర్ పడాల శ్రీదేవి నానాజీ, అయితాబత్తుల ఉమా మహేశ్వరరావు, కంచిపల్లి అబ్బులు, అతిథులుగా చల్లపల్లి గ్రామ సర్పంచ్ ఇసుకపట్ల జయమణి రఘుబాబు, భవాని శేఖర్, కొప్పుల నాగ మానస, మండల నాయకులు లింగోలు పండు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, పోలిశెట్టి బాబులు, చిక్కాల సత్య ప్రసాద్, యం.పి.టీ.సి తిక్కా శేషుబాబు, ఆర్.డి.యస్.ప్రసాద్, కోరపు ఈశ్వర్ పాల్గొనగా, పోలిశెట్టి చిన్ని, వాకపల్లి వేంకటేశ్వర రావు, నూకల రాజా, పిల్లా రవి, గంధం శ్రీను, నల్లా వేంకటేశ్వరరావు, అల్లాడ రవి, పోలిశెట్టి కన్నా, గంగాబత్తుల కిషోర్, సత్తి చిన్న, తిక్కా సరస్వతి, ఛాట్ల మంగతాయారు, కరాటం వాణి, లక్ష్మి మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.