ఖమ్మం జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

భారత రత్న డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నందు అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వీర మహిళా విభాగం అధ్యక్షులు భోగ హరిప్రియ గారు, మరియు ప్రసన్న గారు, జనసేన ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన కమిటీ ప్రధాన కార్యదర్శి మేడబోయిన కార్తీక్, జనసేన ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన ఉపాధ్యక్షులు యాసంనేని అజయ్ కృష్ణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మైలవరపు మణికంఠ, ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్, మరియు కూరాకుల గోపికృష్ణ, దేవరకొండ సురేష్,చల్లా శ్రీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.