ఐదేళ్లకొకసారి ఓటు అనే ఆయుధంతో నీ తలరాతను మార్చుకో

కొత్తచెరువు, భారత రాజ్యాంగం సృష్టికర్త అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఈరోజు కొత్తచెరువు కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు జనసేన నాయకులు పూల శివ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది. సామాన్య ప్రజలకు ఆయుధ రూపంగా ఓటు అనే హక్కును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించారు దానిని నిజంగా మనం ఎన్నికల సమయంలో సద్వినియోగం చేసుకుని ఉంటే ఈరోజు మన రాష్ట్ర దుస్థితి ఇలా అంధకారంలోకి వెళ్ళేది కాదు. ఆ మహనీయుడు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు చట్టాలు ఉండే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించారు దానిని సరైన రీతిలో అమలు పరిచే విధంగా ఉండే వ్యక్తులను గెలిపించుకోలేక మనం విఫలం అవుతున్నాము. నేరగాళ్లు, దుర్మార్గులు, అవినీతిపరులు రాజకీయాలను శాసిస్తూ అంబేద్కర్ కలలుగన్న ఈ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచకుండా వారి స్వార్ధానికి వినియోగించుకుంటూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారు. కావున అంబేద్కర్ మన చేతికి ఐదేళ్లకొకసారి ఓటు అనే ఆయుధంతో నీ తలరాతను మార్చుకో అని అందించారో దానిని సద్వినియోగం చేసుకుంటే ఆ మహనీయుడు కలలు కన్న స్వరాజ్యాన్ని మనం రూపొందించగళం అని అన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తచెరువుమండల కన్వీనర్ పూల శివ ప్రసాద్, బిజేపి నాయకులు హిందూపురం పార్లమెంట్ జనరల్ సెక్రటరీ భాస్కర్ నాయక్ గారు, జనసేన నాయకులు పూల వెంకటేష్, పసుపులేటి సూర్యనారాయణ, మల్లేష్, నరేంద్ర, పసల లోకనాథ్, సల్లప్ప, కుల్లాయప్ప, గూడా శ్రీనివాసులు, నాగేంద్ర, బాలాజీ, కిరణ్, అంజి, నాగార్జున, చాంద్, నరసింహులు, కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.