పితాని ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

కోనసీమ జిల్లా, ముమ్మిడివరం. భారత రాజ్యాంగ ప్రదాత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి.. మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతి ఉత్సవాలు ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జనసేన రాష్ట్ర పి.ఎ.సి సబ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం కాశీవారి తూము సెంటర్ లో అంబేద్కర్ నిలువెత్తు కాంశ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ మహనీయునికి నివాళులు అర్పించి జయంతి శుభాకాంక్షలు తెలియజేసారు.

నియోజకవర్గం నలుమూలల నుండి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు అంబేద్కర్ మహనీయుని సేవలను కొనియాడారు. అట్టడుగు, అణగారిన వర్గాలు నేడు సగర్వంగా తలెత్తుకుని బ్రతికేలా ఆయన‌ కల్పించిన రాజ్యాంగ హక్కులను తలుచుకున్నారు.
అంబెడ్కర్ ఆశయాలు కల్గిన జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు 5 కోట్లు రూపాయలు విరాళం ప్రకటించి వారికుటుంబాలకు అండగా నిలబడ్డారని పితాని బాలకృష్ణ ప్రశంసించారు.

అమలాపురం కేంద్రంగా ఏర్పడిన కొత్తజిల్లా కోనసీమ జిల్లాకు, కోనసీమప్రజల ఆరాజ్యదైవం అంబేద్కర్ మహనీయుని పేరుపెట్టాలని జనసేన పార్టీ లో తొలుత ప్రతిపాందించిది జనసేన పార్టీయేనని పితాని బాలకృష్ణ అన్నారు. అనంతరం జనసేన పార్టీలో బద్దతతో పనిచేస్తున్న ఎస్సి కార్యకర్తలను, బీసీ కార్యకర్తలను, వీరమహిళలను దుశ్శాలువతో సత్కరించి అభినందలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో, గుద్దటి జమి, సానబోయిన మల్లికార్జున రావు, మద్ధింశెట్టి పురుషోత్తం, తాళ్లూరి ప్రసాద్, యలమంచిలి బాలరాజు, జక్కంశెట్టి పండు, గోలకోటి వెంకన్న బాబు, మోకా బాలప్రసాద్, పెమ్మాడి గంగాద్రి, అత్తిలి బాబురావు, సవరపు వెంకట్, రాయపురెడ్డి బాబి, గిడ్డి రత్నశ్రీ, ఓగురి బాగ్యశ్రీ , కడలి వెంకటేశ్వరావు (కొండ), శివ, రాంబాబు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.