అంబేద్క‌ర్ జ‌న్మించిన రోజు – భార‌త‌దేశానికి పండ‌గ రోజు

వట్టిచేరుకురు, అట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి అంబేద్క‌ర్ జ‌న్మించిన రోజు..భార‌త‌దేశానికి పండ‌గ రోజు. అణ‌గారిన‌వ‌ర్గాల హ‌క్కుల‌కి పెద్ద దిక్కుగా నిలిచిన బాబాసాహెబ్ జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయునికి నివాళుల‌ర్పిస్తున్నాము. రాజ్యాంగ నిర్మాత‌, దార్శ‌నికుడు, త‌త్వ‌వేత్త అయిన‌ అంబేద్క‌ర్ మ‌హాశ‌యుని ఆశ‌యాల సాధ‌న‌కి కృషి చేయ‌డం మ‌న బాధ్య‌త‌ అంబేద్క‌ర్ గారి 131 వ జయంతి కార్యక్రమంలో వట్టిచేరుకురు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ప్రత్తి భవన్నారాయణ ఆధ్వర్యంలో ముట్లూరు గ్రామంలో నివాళులర్పించటఒ జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రత్తి. భవన్నారాయణ గారు మండల ఉపాదక్షుడు కోట అనిల్ కుమార్, ముట్లూరు గ్రామ అధ్యక్షుడు కోటికం వెంకటేశ్వరరావు మండల ప్రధాన కార్యదర్శి అల్లం దశరథ రామయ్య, మండల కార్యదర్శి గంగిశెట్టి వెంకటేశ్వరరావు, గ్రామ ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి లక్ష్మయ్య, ప్రత్తి భ్రమయ్య మండల సంయుక్త కార్యదర్శి బాలసాయి, ప్రవీణ్, కిషోర్, సాయి సర్దార్, గేర రాజేష్, బుర్రి నాగేశ్వరరావు, ప్రవీణ్ కోవెలమూడి, అశోక్ కోవెలమూడి, తదితరులు పాల్గొన్నారు.