వారాహి యాత్రకు అంబులెన్సు సిద్ధం

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టే వారాహి యాత్రను జనహిత పేరుతో అంబులెన్సు వాహనం అనుసరించనుంది. అత్యవసర సమయాల్లో వైద్య సదుపాయం అందించే విధంగా అంబులెన్స్ లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 8 గంటల లైఫ్ సపోర్ట్ తో వెంటిలేటర్, మోనిటర్ తోపాటు ఆక్సిజన్, ఎమర్జెన్సీ కిట్లూ జనహితలో ఉన్నాయి. అత్యవసర మందులు, ప్రాథమిక వైద్యానికి తగిన పరికరాలు కూడా అంబులెన్స్ లో ఉంచారు. జనహితను డాక్టర్ లక్ష్మణరావు చిట్టెం పర్యవేక్షించనున్నారు. వారాహి వెనుకనే వచ్చే ఈ జనహిత అంబులెన్స్ లో డ్యూటీ డాక్టర్, నర్సు, డ్రైవర్ ఉంటారు. జనహిత అంబులెన్సును సోమవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రారంభించారు. అంబులెన్స్ లోని అత్యాధునిక వైద్య పరికరాలను స్వయంగా పరిశీలించారు. అంబులెన్సు పర్యవేక్షకుడు డాక్టర్ లక్ష్మణరావు చిట్టెంతో మాట్లాడి ఇతర వివరాలు తెలుసుకుని, అభినందించారు. ఈ సందర్బంగా శ్రీ మనోహర్ మాట్లాడుతూ “వారాహి యాత్రలో అంబులెన్సు అవసరమే రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం” అన్నారు.