రోడ్లు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేసిన అనంత సాగరం జనసేన

ఆత్మకూరు, నియోజకవర్గంలో పలు మండలాల్లో రోడ్లు అడగుకో గుంత గజానికో గొయ్యి లాగా అధ్వానంగా ఉన్నాయని ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, అనంతసాగర్ మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ మహబూబ్ మస్తాన్ మాట్లాడుతూ ఆత్మకూరు నుంచి బట్టేపాడు, అప్పారావు పాలెం రోడ్డు చాలా దారుణంగా ఉందని అన్నారు. అప్పారావు పాలెం సమీపంలో ఇసుక రీచ్ ఉన్నందువలన ఈ రహదారి వెంబడి నిత్యము భారీ వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి దాంతో రోడ్డు అడగుకో గుంత గజానికో గొయ్యి గా తయారయింది. అదే విధంగా అనంత సాగరం మండలంలో సోమశిల రోడ్డు ఉప్పలపాడు నుంచి పడమటి ఖమ్మంపాడు ఇసుక రీచ్ వరకు రోడ్డు మీద ప్రజలు ప్రయాణించాలంటే ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని, వెళ్ళవలసి వస్తుంది. ఆత్మకూరు నుంచి వింజమూరు వెళ్ళే రోడ్డు దారుణంగా ఉంది. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో ఉన్న హనుమాన్ జంక్షన్ నుంచి పట్నంలో వెళ్లే బైపాస్ రోడ్డు కూడా చాలా దారుణం, పట్నంలో కొన్ని ప్రాంతాలు కూడా రోడ్లో చాలా అధ్వానంగా ఉన్నాయని, మండలంలో గ్రామాలకు అనుసంధానం అయ్యే రోడ్లు కూడా చాలా అధ్వానాలు ఉన్నాయని గత నెల జూలై 15 రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 15 తారీఖులోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఓట్లు వేయించుకున్న ఈ ప్రభుత్వము, ఆయన ఇప్పటి వరకు రోడ్లు పూర్తికాలేదని, మాట తప్పడం మడమ తిప్పడం ప్రభుత్వానికి సహజమని తెలుసుకోవాలి అన్నారు. డీసెల్ సెస్ టాక్స్ రూపంలో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తున్నాయి కానీ రహదారులు మర్మతులు జరగటం లేదన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న రోడ్లు వెంటనే పూర్తి చేయాలని జనసేన పార్టీ తరపునుంచి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.