టి.సుండుపల్లి మండల పరిధిలో తోట బడి

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల పరిధిలో పలు ప్రాంతాల్లో మామిడి తోటల రైతులకు తోట బడి కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించడానికి ఆర్.బికె సుండుపల్లి ప్రతినిధి మల్లికార్జున, వివిధ రకాల శాఖల రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి రైతులతో సమావేశాలు ముఖాముఖి సందర్భంగా రైతు బంధువు, సంచాలకులు మరియు జనసేన నాయకులు రామశ్రీనివాస్ మాట్లాడుతూ రసాయన ఎరువులు వద్దు! సేంద్రీయ ఎరువులు ముద్దు అంటూ… పాత కాల పద్ధతులను దృష్టిలో పెట్టుకుని రైతులందరూ చైతన్యవంతంగా భావితరాల భవిశేత్తు కోసం బాధ్యతగా అడుగులు వేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల వివిధ రకాల శాఖల ప్రతినిధులు, రామాంజులు, ఆర్ వీరణగయ్య, రైతులు పాల్గొన్నారు.