చెరుకు రైతుల కోసం బాబు పాలూరు నిరాహార దీక్ష

విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిలు చెల్లించాలంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో బొబ్బిలి రైల్వేస్టేషన్ జంక్షన్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. NCS షుగర్ ఫ్యాక్టరీ, యజమాన్యం దాదాపు ఐదు సంవత్సరాల నుంచి చెరుకు రైతులకు బకాయిలు చెల్లించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రైతుల బకాయిలు చెల్లించాలని జనసేన పార్టీ ఇదివరకే చాలాసార్లు పోరాటం చేసింది, అయినా సరే ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు రైతులకు న్యాయం చేయడం లేదు కావున జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష ద్వారా ప్రభుత్వానికి చెరుకు రైతుల కష్టాలు తెలియజేయాలని ఈ పోరాటం చేస్తున్నామని విజయనగరం జిల్లా బొబ్బిలి జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు తెలిపారు.