అనంతపురం జిల్లా కలెక్టర్‌ను ప్రశంసించిన కేంద్రం

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించింది. ఈ విషయంఫై స్పెషల్ ట్వీట్ చేసింది.

అనంతపురం జిల్లాలో కోవిడ్ సెంటర్లలో ఉన్న వ్యక్తుల్లో కాలక్షేపం లేకపోవడంతో ఒంటరితనం భావనలో ఉండడాన్ని  గమనించిన కలెక్టర్‌ శారీరక, మానసిక ఉల్లాసం కల్పించడం ద్వారా వారిలోని ఒంటరి భావన తొలగించవచ్చని ఆలోచిoచి మానసికంగా ఉల్లాసం నింపేoదుకు కేర్‌సెంటర్లలో టెన్సిస్, షెటిల్, వాలీబాల్, క్యారమ్స్‌ వంటి ఆటలు, సంగీతం కోసం మ్యుజిక్‌ సిస్టం ఏర్పాటు చేయించారు. ఉదయం, సాయంత్రం వేళ ఎవరికి నచ్చిన.. వచ్చిన ఆటలను ఆడుకునేలా అవకాశం కల్పించారు. అలాగే కేర్‌ సెంటర్లలో కౌన్సిలర్లను ఏర్పాటు చేసి.. కోవిడ్‌ పేషంట్లకు కౌన్సిలింగ్‌ ఇస్తూ ఆత్మస్థైర్యం నింపుతున్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో పేషంట్ల ఉల్లాసం కోసం విడుదల చేసిన డాక్యుమెంటరీపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో తీసుకుంటున్న చర్యలతో పేషంట్లు త్వరగా కోలుకుంటారని పలు ప్రశంసలు కురిపించింది.