టీడీపీ నేత మాగంటి బాబు కుమారుడు రాంజీ కన్నుమూత

టిడిపి నేత, ఏలూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మాగంగటి బాబు పెద్ద కుమారుడు రాంజీ మృతి చెందారు. మూడు రోజుల క్రితం ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా…అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసియులో ఉంచి చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూనే ఆయన మృతి చెందారు. అవయవదానానికి ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించారని సమాచారం. ఆయన భౌతిక కాయాన్ని ఏలూరు తరలించనున్నారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. రాంజీ టిడిపి కార్యకలాపాల్లో క్రియా శీలంగా వ్యవహరించేవారు.