ముంపు ప్రాంత ప్రజలకు అండగా నిలిచిన అనంతపురం జనసేన

  • బాధితులకు ఆహారం మరియు మంచినీళ్ళు పంపిణీ

అనంతపురం, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి అనంతపురం నియోజకవర్గంలో సోమనాథ్ నగర్, హనుమాన్ కాలనీ, శాంతినగర్, వివేకానంద నగర్, సిపిఐ కాలనీ, యువజన కాలనీ, నెహ్రూ పూర్ మెన్ కాలనీ, రంగస్వామి నగర్, ఎరుకుల వారి వీధి, రజక కాలనీ నీట మునగడం జరిగింది. అధిక వర్షాలకు ముంపునకు గురైన రంగస్వామి నగర్, రజకుల నగర్ ప్రాంతాల్లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురం అర్బన్ జనసేన పర్టీ ఇంచార్జ్ టి.సి.వరుణ్, కార్యక్రమాల కార్యనిర్వహణ కమిటీ సభ్యులు భవాని రవికుమార్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంక్య ఈశ్వరయ్య, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితుల సాధకబాధలు అడిగి తెలుసుకొని బాధితులకు భోజనము మరియు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురం అర్బన్ జనసేన పర్ట్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ మాట్లాడుతూ కష్టాలలో ఉన్న ప్రజలకు కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన పార్టీ, అధికార యంత్రాంగం ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగా అక్రమాలు నగరంలో పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ జనసైనికులు నాయకులు పాలు పంచుకుంటారని తెలిపారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు జిక్కిరెడ్డి ఆదినారాయణ, గ్రంధి దివాకర్, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేష్, రోళ్ళ భాస్కర్, దరాజ్ భాష, నగర కార్యదర్శులు విశ్వనాథ్, మురళి, లాల్ స్వామి, సంపత్, జిల్లా సహాయ కార్యదర్శిలు విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, నగర సంయుక్త కార్యదర్శిలు రమణ, ఆకుల అశోక్, పవన్ కుమార్ కార్యనిర్వాహణ కార్యక్రమాల కమిటీ సభ్యులు పామురాయి వెంకటేష్ మరియు నాయకులు పవనిజం రాజు, శ్రీనివాస్, వెంకటేష్, నజీమ్, సిద్ధూ, హరీష్, నాగరాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.