ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 38వ రోజు పాదయాత్ర

ఏలూరు: చాలీచాలని కూలితో డొక్కాడడని కార్మికుల ఆవేదన. అర్హులైనా సంక్షేమానికి దూరమైన పేదల ఆక్రందన.. ఉద్యోగాలు రాక జీవితాల్ని కోల్పోతున్నామని వేదనకు గురవుతున్న యువత.. ఇలా పలు వర్గాల సమస్యల్ని సావధానంగా ఆలకిస్తూ.. భవిష్యత్తులో అందరికీ న్యాయం చేస్తామని ధైర్యాన్నిస్తూ.. ప్రజల అడుగులో అడుగులేస్తూ ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట కార్యక్రమాన్ని మంగళవారం 12వ డివిజన్ లో గడియార స్తంభం నుండి నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ ఆధ్వర్యంలో జననీరాజనాల నడుమ ప్రారంభించిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు ఈ పోరుబాటను చైతన్య యాత్రగా మలిచారు. ఏలూరు నగర వీధుల్లో ఆద్యంతం అప్పలనాయుడుకు అపూర్వ స్వాగతం లభించింది.. అభిమానులు పలుచోట్ల పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించారు. గజమాలతో సత్కరించారు. విద్యార్థుల కేరింతలు పోరుబాటకు మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ 12వ డివిజన్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఇక్కడ చూస్తే వ్యాపారస్తులంతా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టాక్స్ ల రూపంలో వ్యాపారస్తుల్ని వేధిస్తున్నారు, బిజినెస్ లు లేవు, కొనుగోలు శక్తి పడిపోయింది, ఉపాధి దొరికే అవకాశం లేదు, టాక్స్ లు కట్టలేక ఉపాధి కూడా మూత పడిపోయాయని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అంతా అప్పులమయంగా తయారయింది. ఈ విధంగా ఉంటే రేపు వచ్చే తరానికి భవిష్యత్తు లేకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై ప్రజలంతా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఈ డివిజన్ లోని కొన్ని ఏరియాలో శానిటరీ పనిచేయడం లేదు‌. ఏలూరు మున్సిపల్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. దీనికి యజమానిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళనాని ఉన్న సమస్యలను పరిష్కారం చేయకుండా సొంత ప్రయోజనం కోసం పనిచేస్తున్నారు. ఏలూరు నియోజకవర్గ ప్రజలు కొన్ని దఫాలుగా వారిని ఎన్నుకొని చాలా పెద్ద తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేడని ఆళ్ళనాని నీ విమర్శించారు.ఈయన ఎలక్షన్ ముందు మాత్రమే వస్తారు. తర్వాత వచ్చే పరిస్థితిలో లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులో ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అని ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామని ఆలోచనతోనే ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, మేయర్,3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందిన ఆళ్ళనాని అందరికీ యజమానిగా ఉండాలని ఏలూరులో ఉన్న సమస్యలు త్వరితగతిన పరిష్కారం చేయాలని దీనిపై దృష్టి పెట్టాలని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుండి తీవ్రంగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, గుబ్బల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, కే.సరళ, ఎట్రించి ధర్మేంద్ర, బుద్ద నాగేశ్వరావు, బుదిరెడ్డి బలరాం, కూనిశెట్టి మురళి, పవన్, గొడవర్తి నవీన్ కోశాధికారి పైడి లక్ష్మణరావు, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ చిత్తిరి శివ, కోలా శివ 1 టౌన్ మహిళా కార్యదర్శి దుర్గ బి, సంయుక్త కార్యదర్శి కె.ప్రమీల రాణి, ప్రియా రాణి నాయకులు మేకా సాయి, దుర్గ, పొన్నూరు రాము, గెడ్డం చైతన్య, నాగేశ్వరరావు, జనసేన అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.