ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

  • అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించిన యల్లటూరు శ్రీనివాసరాజు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట యల్లటూరు భవన్ నందు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించిన జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు రాజీలేని పోరాటం చేసి తన ప్రాణాలు అర్పించి ఆంధ్ర రాష్ట్రాన్ని అవతరించేలా చేశారని అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు లాంటి వారు 11 మంది ఉంటే ఒక సంవత్సరం లోపల మన దేశానికి స్వాతంత్రం తెచ్చేవారని గాంధీ గారు అన్నారంటే ఆయన అకుంఠిత దీక్ష, పోరాట తత్వం ఎలాంటిదో తెలుస్తుంది అని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటుపై త్యాగాలు చేసిన ఎందరో మహనీయులను గుర్తు చేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రాక్షస పాలన నుండి విముక్తి కల్పించేందుకు ప్రజలు ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శింగంశెట్టి నరేంద్ర, మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, పి.వి.ఆర్ కుమార్, నాసిర్ ఖాన్, పత్తి నారాయణ, మౌలా, తోట సురేష్, చిట్టే భాస్కర్, భీమినేని రమేష్, అఫ్రోజ్, సుబ్బరాజు మరియు సాయి రాజు తదితరులు పాల్గొన్నారు.