అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన దారం అనిత

మదనపల్లె, డాక్టర్ భీమ్‌ రావ్ అంబేద్కర్ జయంతి. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడాయన.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని యావత్ భారతావని ఆయన సేవలను స్మరించుకుంటూ జనసేన పార్టీ తరపున చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అనిత దారం అంజలి ఘటించడం జరిగింది.