అంగన్వాడీ ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైకాపా ప్రభుత్వం

  • వైకాపా ప్రభుత్వం అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్ల అమలు చేయకపోగా బెదిరింపులకు దిగడం నియంత చర్య

అనంతపురం: వైకాపా ప్రభుత్వ బెదిరింపులకు భయపడి విషద్రావం త్రాగి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న అనంతపురం నగరానికి చెందిన 9వ నెంబర్ అంగన్వాడి సెంటర్లో సహాయకూరాలిగా పనిచేస్తున్న డి.సరితని పావని హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి మనో దైర్యన్ని ఇచ్చిన జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 40 రోజుల నుంచి న్యాయపరమైన డిమాండ్ల అమలు కోసం నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు మరియు సహాయకుల ప్రధాన డిమాండ్లను వైకాపా ప్రభుత్వం అమలు చేయకపోగా విధులలో నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడంతో సరిత తన ఉద్యోగం ఎక్కడ పోతుందో నన్న భయంతో తీవ్ర మనోవేదనకు గురై విషద్రావం త్రాగి ఆత్మహత్య చేసుకోవాలనుకుందని ఈ జగన్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తూ ప్రజలపై కక్షగట్టి పరిపాలన సాగిస్తున్నాడని ఏ అంగన్వాడి కర్యకర్తకుడా తమ ఉద్యోగం పోతుందేమోనని భయపడవలసిన పనిలేదని ఇక 2నెలలు ఆగితే వచ్చేది జనసేన, టీడీపీ ప్రభుత్వమే అని మీ అన్ని రకాల డిమాండ్లను పరిష్కరించే బాధ్యత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.