అన్నదానం చేసిన అన్నవరం హెల్పింగ్ హ్యాండ్స్

ఇచ్ఛాపురం: సంస్థ సభ్యుని పుట్టినరోజు సందర్భంగా ఇచ్ఛాపురం, కవిటి ప్రాంతంలో రహదారి ఇరువైపులా ఉన్న యాచకులకు అన్నదానం చేశారు. ఈ గొప్ప ఆలోచనకి బలరంపురం గ్రామం సాంబ రెడ్డి కి అన్నవరం హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరపున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు లలిత, హరిప్రియ, ధనుంజయ, తిరుమల, దేవేంద్ర పాల్గొన్నారు. సోంపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్సకు రక్తం కోసం ఎదురు చూస్తున్న వరక గ్రామం హేమ మజ్జి అనే మహిళకు అత్యవసర పరిస్థితుల్లో ఎ పాజిటివ్ బ్లడ్ కావాలని అన్నవరం హెల్పింగ్ హ్యాండ్స్ ని సంప్రదించగా రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్ దుద్ది శ్రీనివాసు పేషెంట్ భర్తకు ఏ పాజిటివ్ బ్లడ్ ఒక యూనిట్ ఇవ్వడం జరిగింది. సమయానికి బ్లడ్ ఇచ్చిన దుద్ది శ్రీనుకి సంస్థ తరపున ధన్యవాదములు గోపి బిశాయి తెలిపారు.