అరుదైన వ్యాధితో బాధపడుతున్న అరవ్ కు అండగా అన్నవరం హెల్పింగ్ హ్యాండ్స్

ఇచ్చాపురం: కవిటి మండలం, మాణిక్యపురం గ్రామానికి చెందిన జుజిస్టి బిసాయి, కవిత దంపతుల కుమారుడు అరవ్ బిసాయి హెచ్ ఎల్ హెచ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నడు. బోన్ మెరో ట్రాన్స్ ప్లాంట్ వైద్య చికిత్సకు 20లక్షలు వరకు ఖర్చు అవుతుందని చిల్డ్రన్ ఆసుపత్రి వైద్యులు సూచించారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి రోజు వారి కూలితో పూట గడిపే తాము ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసే స్తోమత లేదు అని నిరుపేద తండ్రి వాపోయాడు. ఇప్పటికే అప్పులతో సతమత మవుతున్న తమకు దాతలు స్పందించి తమ బిడ్డకు ప్రాణదానం చేయాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న అన్నవరం హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ బాధితుని తరుపున వివిధ కాలేజ్, స్కూల్ ద్వారా కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని మొత్తం 35,620 రూ అరవ్ తల్లీ తండ్రికి శనివారం అందించారు. సహాయం అందించిన ప్రతీ విద్యార్థులకు, అద్యాపకునికి స్కూల్, కాలేజ్ యాజమాన్యానికి సంస్థ మరియు అరవ్ కుటుంబం తరుపున ధన్యవాదములు. ఈ పేద కుటుంబానికి మిగతా స్వచ్చంద సంస్థలు స్పందించి అండగా నిలబడాలని అన్నవరం హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో లలిత, సునీత, సంగీత, హరిప్రియ, రాజేష్, ప్రశాంత్, సాగర్, సురేష్, సంతోష్, రాజు, గోపి పాల్గొన్నారు. దయాహృదయ సామాజిక పెద్దలు స్పందించాలి అని సభ్యులు కోరారు. ఈ గొప్ప సేవా కార్యక్రమానికి సహకారం అందించిన ప్రతీ సభ్యునికి పేరు పేరునా అభినందనలు సంస్థ వ్యవస్థాపకుడు తెలిపారు.