సర్వేపల్లి నియోజకవర్గంలో మరో ఉద్దానం!!

సర్వేపల్లి నియోజకవర్గం: సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీ నందు కొండ కింద ఎస్టి కాలనీ నందు మంగళవారం పర్యటించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు జనం కోసం జనసేన 35వ రోజు కసుమూరు పంచాయతీలోని కొండ కింద పల్లి నందు వైసిపి వైఫల్యాలను గడపగడపకు తెలియజేస్తూ కొనసాగించడం అందులో భాగంగా అనేక సమస్యలు మా దృష్టికి స్థానికులు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలం కసుమూరు పంచాయతీ పరిధిలోని కొండ కింద ఎస్.టి కాలనీ నందు నివాసం ఉంటున్న ఎంతోమంది ప్రజలు కిడ్నీ వ్యాధితో ఇబ్బందులు పడుతూ కనీసం ఇప్పటివరకు 6గురు చనిపోవడం జరిగింది. ఈ కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణం తాగునీరు. ఇక్కడ బోరు, కుళాయి నీళ్లు తాగడం వలన కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని చెప్పి అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. ఇక్కడకు వచ్చి చూస్తే మరో ఉద్దానంగా సమస్య ఉంది అనిపిస్తుంది. ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఈ వెంకటాచలం మండలంలో కసుమూరు పంచాయతీ నందు ఆయన గడపగడపకు తిరిగాడు కానీ ఇక్కడ ఎస్.టి కాలనీ నందు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారి సమస్యలు ఆయనకు పట్టవా కిడ్నీ వ్యాధితో కుటుంబ యజమానులు చనిపోతే ఆ కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి భర్త చనిపోయిన మహిళలకి కనీసం పెన్షన్ కూడా రాసిన పరిస్థితులు లేవు 15 రోజుల లోపల వీళ్ళకి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే దానికి ముందుకు వెళ్తారా లేదంటే జనసేన పార్టీ వాళ్లకి తాగడానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయమంటారా అని సురేష్ నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, మండల ప్రధాన కార్యదర్శి కాకి శివ, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సుమన్, సాయి, స్థానికులు మస్తాన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.