ఎపి కి మరో మూడు లక్షల కోవిషీల్డ్‌ టీకాలు..

ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వ్యాక్సిన్ నిల్వలు తగ్గిపోవడంతో టీకాలు కావాలని ఇప్పటికే కేంద్రానికి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కాగా, ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి మూడు లక్షల టీకాలు గన్నవరం చేరుకున్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ టీకాలు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న టీకాలను వ్యాక్సిన్ నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వైద్యారోగ్యశాఖ ఆదేశాల తరువాత ఆ టీకాలను అవసరమైన జిల్లాలకు పంపిణి చేయనున్నారు.