మున్సిపల్ కమీషనరుకి వినతిపత్రమిచ్చిన అనుశ్రీ

రాజమండ్రి సిటీ, ఇటీవలే డ్రైనేజీలో పడి మృతి చెందిన ఏరుకొండ నాగేశ్వరావు విషయాన్ని శుక్రవారం మున్సిపల్ కమీషనర్ దృష్టికి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ తీసుకువెళ్లడం జరిగింది. ఈ డ్రైనేజ్ తవ్వకాలు మరియు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైనందుకు దీనిపై కమిషనర్ తగు చర్యలు తీసుకోవాలని, ప్రజలు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారని, కాంట్రాక్టర్లు కనీస జాగ్రత్తలు తీసుకోవట్లేదనీ కనీసం స్ట్రీట్ లైట్లు కూడా లేవని పలు సమస్యల్ని కమీషనర్ కి అనుశ్రీ వివరించారు. ప్రభుత్వం నుంచి 50 లక్షలు ఎక్స్గ్రేషియా వచ్చేలాగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం చేయమని కమీషనర్ కి వినతిపత్రం అందజేశారు. అలాగే కమిషనర్ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటామని, ఇటువంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ముందస్తుగా ఉంటామని, ఈ విషయానికై మా పై అధికారులతో కూడా మాట్లాడుతున్నామని వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పైడిరాజు, సిటీ కార్యదర్శి గుణ్ణం శ్యాంసుందర్, సంయుక్త కార్యదర్శి దేవకివాడి చక్రపాణి, జనసేన యువ నాయకులు బయ్యపునీడి సూర్య మరియు 28వ వార్డు జనసైనికులు విక్టరీ వాసు, మణికంఠ అడపా మరియు సూర్య మిత్ర బృందం పాల్గొన్నారు.