ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదం

పెడన, కరోనా థర్డ్ వావ్ ఉదృతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి తర్వాత విద్యాసంస్థలను పునః ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లో రోజుకి పది వేలకు పైబడి కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. అమ్మ ఒడిని స్కూలు హాజరుతో లింకు పెట్టడం చేత, గత్యంతరంలేని పరిస్థితుల్లో విద్యార్థులు బడికి వెళ్తున్నారు. 75% హాజరు కాని యెడల అమ్మ ఓడి పోతుందనే భయంతో తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి వ్యాక్సిన్ ఇచ్చాము కనుక విద్యాసంస్థలు తెరిచామని చెబుతున్నారు. మహారాష్ట్రలో 15-18 సంవత్సరాల వయసున్న విద్యార్థులకు మనకంటే ఎక్కువమందికి వ్యాక్సినేషన్ వేశారు. కానీ అని మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. తెలంగాణలో రోజుకు 2000 కరోనా కేసులు నమోదు అవుతున్నప్పటికీ ముందు జాగ్రత్తతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రోజుకి పదివేలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. కావున ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించవలసిందిగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని జనసేన పార్టీ పెడన నియోజకవర్గం నాయకులు ఎస్ వి బాబు సమ్మెట తెలిపారు.