బహుజనవాదం బలంగా వినిపించే జనసేన

బహుజన విధానంతో ముందుకెళ్తూ… సర్వజనుల అభ్యున్నతిని కాంక్షిస్తూ జనసేన ప్రస్థానం ముందుకు సాగుతుంది. అగ్రవర్ణ పేదలకు అండగా ఉంటూనే… బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం జనసేన ఎప్పుడు పట్యాడుతుంది. సమాజంలో మార్పు రావాలి, సమతుల్యతతో కూడిన సర్వేజనా సుఖినోభవంతు విధానం రావాలనేది జనసేనాని బలమైన ఆకాంక్ష . “తెలంగాణ చాలా చైతన్యవంతమైన నేల. అన్యాయం జరిగితే నాటక, పద్య, కళ, గేయ రూపంలో ప్రజలు అన్ని చోట్ల గళమెత్తుతారు. 2014లో పార్టీ పెట్టినప్పటినుండి సమాజంలో మార్పు కోసం, సర్వజనుల అభ్యున్నతికి పాటుబడే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్. సామాజిక స్పృహ, దేశభక్తి జనసేనాని ని పార్టీని స్థాపించేలా చేశాయి. 2008లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు బడుగు, బలహీన వర్గాల కష్టాలను చూసి తనవంతు ఏదోకటి చేయాలనే తాపత్రయం పడే వ్యక్తి జనసేనాని. అగ్రవర్ణాల్లో పేదల కష్టాలను అర్థం చేసుకుని, కులాలను వాడుకొని అధిపత్యం చెలాయించే కుటుంబాలు, వారి దగ్గర నలిగిపోయే ప్రజల బాధలు… బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పరితపించే నాయకులు, ప్రజా సంఘాలు, దళిత, బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, అగ్రవర్ణాల్లో పేదల అభ్యున్నతిని ఆకాంక్షించే మిగతా వర్ణాల నాయకులు వీళ్లందరిని కలిపే సమగ్ర ఆలోచన విధానం లేకుండాపోవడం
గమనించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్. కొన్ని సమూహాలే రాజ్యాధికారానికి దగ్గరై మిగతా వారందరిని యాచించే స్థాయిలో పెట్టడం లాంటివి జనసేనానికి అస్సలు నచ్చనివి. వీటిపై మాట్లాడి వదిలేయకుండా తన వంతు బాధ్యతగా ఏదైనా చేయాలని…

దెబ్బ తిని… ఓటములు, వంచనలు, వెన్నుపోట్లు ఉంటాయని తెలిసి కూడా జనసేన పార్టీ పెట్టి అన్ని కులాలకి సమాన ప్రాధాన్యం ఇవ్వాలనేది శ్రీ పవన్ కళ్యాణ్ కోరుకునేది.

శ్రీ కాన్షీరామ్ గారిని అమితంగా గౌరవించే వ్యక్తి, బహుజన సిద్దాంతాలను సంపూర్ణంగా అవపోసనపట్టి… తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ గడిపిన జనసేనాని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని, సర్వేజన సుఖినోభవంతు అని ముందుకు వెళ్లకపోతే తప్పు చేసిన వాళ్లమవుతామని ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. కాన్షీరాం గారు ప్రారంభించిన దళిత ఉద్యమం బహుజన ఉద్యమంగా మారి అటు పిమ్మట సర్వజన విధానంగా పుదిద్దుకుంది. కొద్ది మందికే నిలబడతాం అని కాకుండాఅణగారిన వర్గాలకు నిలబడతాం, అందరికి న్యాయం చేస్తామనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది.

బహుజన సిద్ధాంతం అని ఎందుకు జనసేనాని చెబుతుంటారు అంటే – అణగారిన వర్గాలు సాధికారత సాధించాలి. సంఖ్యాబలం ఉండీ రాజ్యాధికారాన్ని సాధించని కులాలు కూడా ఉన్నాయి. రాజ్యాధికారం కొన్ని ఆధిపత్య కుటుంబాలకే పరిమితమైంది. పాలక వర్గంలో ఉన్నవారు కులాన్ని ఆధారంగా చేసుకొని వచ్చి.. ఆ తరవాత తమ కులానికే నష్టం కలిగిస్తున్నారు. సంఖ్యా బలం ఉండీ అధికారం లేని వాళ్లు, అసలు సంఖ్యా బలమే లేని రజక, నాయిబ్రాహ్మణ, వెనుకబడిన సంచార జాతులు, మాదిగ సమాజం, మిగతా దళిత సమూహాలకు అండగా నిలబడటం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కుల వ్యవస్థ చాలా బలీయమైనది. దానిని వాడుకొని కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడుతున్నాయి. జగన్ రెడ్డి గారు తప్పు చేస్తే రెడ్డి సామాజిక వర్గం ఎందుకు సఫర్ అవ్వాలి. పేరుకే అగ్ర వర్ణం బ్రాహ్మణ సమాజం. వారు జీవనానికి ఎన్నో ఇబ్బందులకు లోనవుతుంటారు. కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చిన పాలకులు తప్పులు చేస్తే కమ్మవారు బలై, పాలకులుగా కులాన్ని వాడుకొని వచ్చినవాళ్లు తమ కుటుంబం కోసం, తమ వ్యక్తిగత వర్గం కోసం చూసుకుంటారు. కులానికి నష్టం చేస్తారు. ఈ కారణాలతో బహుజన సిద్దాంతాన్ని బలంగా చెబుతారు శ్రీ పవన్ కళ్యాణ్.

వేల కోట్లు ఉంటే తప్ప రాజకీయం చేయలేని పరిస్థితుల్లో పార్టీ పెట్టడం అనేది సాహసోపేతమైనది. చాలా ఒత్తిడి ఉంటుంది. ఒక మాట ఎక్కువ మాట్లాడినా, ఒక మాట
తక్కువ మాట్లాడినా ఇబ్బంది అయిపోయిన పరిస్థితుల్లో చాలా ఆలోచించి ఒత్తిడి తీసుకొని పార్టీ పెట్టడం జరిగింది. రాజకీయ పార్టీ పెట్టాలంటే అల్పోత్సాహం కాదు దీర్ఘకాలిక ఆలోచన కావాలి. అందుకే 25 ఏళ్ల ప్రస్థానం అంటారు.

వేల కోట్లు, కుల బలంతో ముడిపడిన రాజకీయాల్లో దళిత మహిళలు సర్పంచులుగా గెలవడం, పూరింటి నుంచి వచ్చిన వ్యక్తులు గెలవడం, ఎక్కడో మారుమూల ప్రాంతంలో నివసించే మత్స్యకార కుటుంబంలో వ్యక్తులు విజయం సాధించడం జనసేన పార్టీ లేకపోతే సాధ్యపడేదికాదు. శ్రీకాకుళం జిల్లాలో ఓ మత్స్యకార కుటుంబానికి చెందిన యువకుడు బి.టెక్. చదువుకొని జీవనం కోసం చేపలు అమ్ముతున్నారు. ఆ యువకుడు పార్టీ మద్దతుతో సర్పంచ్ అయ్యాడు. స్థానిక ఎన్నికల్లో తమ వారు తప్ప మిగతా వారిని రాకుండా అధికార పార్టీ కట్టుదిట్టం చేసింది వైసీపీ. జరిగిన స్థానిక ఎన్నికల్లో 6 శాతం ఉన్న జనసేన ఓటు బ్యాంకు 27 శాతానికి పెరిగింది. ఇదే మార్పునకు బలమైన సంకేతం. వేల కోట్లు ఉన్న రాజకీయ పార్టీకి ఎదురొడ్డి నిలబడ్డారు అంటే దానికి ఆడపడుచులు, నిస్వార్థంగా పని చేసిన జనసైనికులే కారణం.

151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇప్పించాలి? ఓడిపోయిన వాడిని వదిలేయ వచ్చు కదా… అయినా వదలరు. ఎందుకంటే మార్పు తీసుకొచ్చే బలం జనసేన కు ఉంది అయితే- ‘ఏమీ లేదు… ఏమీ లేదు’ అని చెప్పి జనసేనాని బలం తెలియనీయకుండా చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జనసేనకు చాలా బలం ఉంది. ఆ బలం బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడుతుంది.

మిగిలిన సామాజిక వర్గాలకు రాజ్యాధికారం రాకుండా చేస్తున్న కొంతమంది వ్యక్తులంటే తనకు ద్వేషం తప్ప.. రెడ్డి సామాజికవర్గానికి తాను శతృవు కాదని చెప్పే ప్రయత్నం
ని చాలా బాగా ప్రసంగించారు రాజమండ్రి సభలో జనసేనాని! కమ్మ సామాజికవర్గంతో తనకు స్నేహం ఉందని చేప్పే ప్రయత్నమూ జరిగింది. అంతకంటే ముందు…
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల ఐకమత్యం చాలా అవసరం అనే సందేశం జనాల్లోకి వెళ్లింది. అందుకోసం కాపు, తెలగ, ఒంటరి, బలిజ
కులాల జనాలు ముందుకు కదలాలనే సూచన స్పష్టంగా వచ్చింది.

తాను కాపు సామాజికవర్గంలో పుట్టినా… తనకు చిన్నప్పటినుంచీ రెడ్లతో స్నేహం ఉందని.. శెట్టిబలిజీలకు సమస్య వస్తే కాపులు కదలాలని.. తనకు ‘తన్ను తాను
తగ్గించుకొనువాడు హెచ్చించబడును’ అనే బైబిల్ లోని వాక్యం తాను పాటిస్తానని.. తన ప్రసంగం మధ్యలో నమాజ్ వినిపిస్తే.. ప్రసంగాన్ని ఆపేస్తానని.. దళితులకు
న్యాయం జరగాలని… బహుజన వాదం వినిపించే ప్రయత్నం పవన్ ప్రసంగంలో పుష్కలంగా కనిపించింది రాజమండ్రి సభలో.

బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం దిశగా జనసేన కృషి చేస్తోంది ఆ దిశగా జనసేన ప్రయాణం తెలంగాణ నుంచే ప్రారంభించారు జనసేనాని. పెద్ద స్థాయి వ్యక్తులు
తమ వాడు పైకి రావాలి అనుకున్నారే తప్ప బడుగు, బలహీన వర్గాలు బయటకు రావాలని ఆశించారు … అలా ఆలోచించే ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్.