రాజధాని కేసుల పై కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు

ఏపీ రాజధాని కేసుల హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఏపీ హైకోర్టులో అధికార వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై వాదనలు వినిపిస్తున్నాయి. సీజే పీకే మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇద్దరు న్యాయమూర్తులను రాజధాని కేసుల నుంచి తప్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. న్యాయమూర్తులపై ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యంతర పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని కేసులను త్వరగా విచారిస్తామని కోర్టు తెలిపింది. కేసుల విచారణతో రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయినట్లు కనిపిస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది.