Amalapuram: ప్రజల సమస్యలపై గళమెత్తిన జనసేన

తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం రూరల్ ఈదరపల్లి గ్రామంలో డ్రైనేజీ సమస్య వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి కొప్పుల నాగ మానస పలు సమస్యలపై గళమెత్తారు. ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్లు, డ్రైనేజీలు నీటమునిగి దోమల వల్ల అనేక రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన పడుతున్నారు. పార్టీలతో సంబంధం లేకపోయినా ప్రజల సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎన్నోసార్లు గ్రామసభ మీటింగులు పెట్టినప్పుడు కూడా తమ వార్డు సమస్యలు చెప్పినా పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారిన మా సమస్యలు కాన రావడం లేదని గ్రామ ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామ సమస్యలు పరిష్కరించి రోగుల బారిన పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.