ఏ పి నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం 20వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి నియోజకవర్గం, శ్రీకాళహస్తి మండలం, కలవగుంట పంచాయతీ లోని, కలవగుంట, కోట, గుండ్ల పల్లి గ్రామాలలో ఈ రోజు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. గ్రామంలో బస్ సౌకర్యం లేదు, డ్రైనేజ్ కాలువలు, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు సమస్యలు గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్యం అధికారంలోకి వచ్చిన 3-6 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు తోట గణేష్, రవి కుమార్ రెడ్డి, శారద, పేట చంద్ర శేఖర్, చిరంజీవి, సురేష్, మునయ్య, గురవయ్య, దినేష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.