బయ్యనగూడెం జనసేన గ్రామకమిటీ నియామకం

పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలంలోని బయ్యనగూడెం గ్రామంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, జిల్లా అద్యక్షులు చినబాబు మరియు చిర్రి బాలరాజు ఆదేశాల మేరకు గ్రామకమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. మన మండల అధ్యక్షులు తోట రవి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నులకాని శ్రీను ని, ఉపాధ్యక్షుడిగా లింగాల నవీన్, ప్రధాన కార్యదర్శిగా నరాల శ్రీను లను ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ విశ్వనాథ్, రావులపాడు ఎంపీటీసీ హరిబాబు, మండల నాయకులు అప్పన ప్రసాద్ అల్లం సత్తిరాజు దాకారపు మధు, గ్రామ నాయకులు వెంకట్ డాక్టర్, పారేపల్లి కగన్, సింహాద్రి వెంకన్న బాబు, కోరుకొండ రామరాజు జనసైనికులు పాల్గొన్నారు.