ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి జనసేన డిమాండ్

పెడన, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కృష్ణాజిల్లా, పెడన నియోజకవర్గం, పెడన పట్టణంలోని 17వ వార్డులో సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కార్మికుడు కాసిన పద్మనాభం కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు బండి రామకృష్ణ(ఆర్.కె) మచిలీపట్నం ఇంచార్జ్, ఎస్ వి బాబు సమ్మెట జనసేన నాయకులు, వరుదు రమాదేవి, కూనసాని నాగబాబు, మట్ట నాగపావని, భవాని, రామ్ సుధీర్, విఘ్నేస్వరరావు, పంచకర్ల సురేష్, ఒడుగు రాజు, చంద్రమౌళి, తిరుమని రామాంజనేయులు, ర్యాలీ సత్యనారాయణ, దొండపాటి చక్రధర్, పాశం నాగమల్లేశ్వరరావు, పుల్లేటి దుర్గారావు, నవీన్ కృష్ణ, జన్యువుల నాగబాబు, వెంకయ్య మరియు పెద్ద ఎత్తున జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేనేత పరిశ్రమను పూర్తిగా విస్మరించడం వల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని అన్నారు. తరువాత ఎస్ వి బాబు సమ్మెట మాట్లాడుతూ నేతన్న నేస్తం ద్వారా నేతన్నలను దగా చేస్తున్నారని, గతంలో ట్రిప్ట్ ఫండ్, యన్నం (నూలు) సబ్సిడీ క్రింద ఒక్క కార్మికుడికి ఏడాదికి సుమారు 60 వేలు వచ్చేవి, కానీ వైసీపీ ప్రభుత్వం ఇరవై నాలుగు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అంతేకాక చేనేత పరిశ్రమకు ఆయువు పట్టు అయిన సహకార సంఘాలు నిర్వీర్యం అయ్యాయి. కార్మికులకు పని కల్పించే స్థితిలో లేవు. కృష్ణా జిల్లాలో 15 కోట్ల విలువగల వస్త్ర నిల్వలు సంఘాల దగ్గర ఉండటంవల్ల, కార్మికులకు మజూరి వేతనాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వం ఆలోచన విధానం మారాలి. క్షేత్రస్థాయిలో చేనేత సమస్యలు పరిష్కరించే మార్గాలను అన్వేషించాలి. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి తక్షణ సహాయం కింద 25 వేల రూపాయలు నగదు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది అని ఎస్ వి బాబు అన్నారు.