జనసేన స్థూపం ధ్వంసం చేసిన దుండగులపై తగు చర్యలు తీసుకోవాలి..

  • ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు

ఇచ్ఛాపురం: కవిటి మండలం, గొర్లపాడు పంచాయతీలోని రాపాక పుట్టుగ, సవసానపుట్టుగ గ్రామాల పరిధిలో హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్న మంగళవారం సంత వద్ద జనసైనికులు నిర్మించుకున్న జనసేన స్థూపాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి, జెండా పోల్ ను ఎత్తుకెళ్లారు. వెంటనే ఆ దుండగులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు కవిటి మండల జనసేన నాయకులతో కలిసి, కవిటి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ.. ఇది వరకే ఇలాంటి ఘటనలు పలుమార్లు జరిగాయని, కవిటి పోలీస్ వారికి తెలియపరచడం జరిగిందని, మరలా అలాంటి ఘటన పునరావృతం అయిందని, జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ.. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను పోలీస్ వారు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, జనసేన రాష్ట్ర మత్స్య వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 10 వ వార్డ్ ఇంఛార్జి రోకళ్ళ భాస్కర్, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, హేమా చలపతి, రాజశేఖర్, తలగాన ఈశ్వర్, వల్లభ రావు, జోగారావు, రామకృష్ణ, ప్రవీణ్ బెహరా, గిరి బెహరా, నవీన్, ధనుంజయం తదితరులు పాల్గొన్నారు.