APSSDC Jobs: Efftronics Private Ltd నోటిఫికేషన్

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ మరో శుభవార్త చెప్పింది. Efftronics Private Ltd కంపెనీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100కు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి ఏడాకి రూ. 1.5 లక్షల నుంచి రూ. 5.2 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. BTech, Diploma, ITI చేసిన వారు దరఖాస్తకు అర్హులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 18 వరకు రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర వివరాలకు 1800-425-2422 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

పోస్టులు, అర్హతల వివరాలు..

Data Scientist:  విభాగంలో రెండు పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ(స్టాటిస్టిక్స్, మాథ్స్) చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. 2018-2020 విద్యాసంవత్సరాల్లో 70 శాతం కన్నా ఎక్కువ మార్కులతో పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విభాగంలో ఎంపికైన వారికి ఏడాదికి రూ. 5.2 లక్షల వేతనం ఉంటుంది.

Embedded Engineer: ఈ విభాగంలో మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, ఎంటెక్ చేసిన వారితో పాటు, ఎంఎస్సీ(ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్) విద్యార్హతల కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.3.8 లక్షల వేతనం ఉంటుంది.

Software Engineer: ఈ విభాగంలో మొత్తం 25 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 2020లో పాసైన వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.3.8 లక్షల వేతనం ఉంటుంది. ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, బీటెక్(CSE/ IT), ఎంసీఏ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.

Solution Support Engineer: డిప్లొమో, బీటెక్(ఈఈఈ, ఈసీఈ,ఈఐఈ) బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్) చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ విభాగంలో మొత్తం 30 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.2.2 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. ఇతర పోస్టులు, అర్హతల వివరాలను కింద ప్రకనటలో చేసుకోవచ్చు.

Registration-Direct Link