వైసీపీ కపట విధానాలపై యువత పోరాడాలి: డా.వంపూరు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం కొత్తవీది మండలం, రింతడ పంచాయితీ, గొడిచింత గ్రామంలో మండల నాయకులు రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన పాడేరు అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య మరియు పాడేరు, చింతపల్లి మండలాల నాయకులు ముందుగా గ్రామంలో పర్యటించి, పలుసమస్యలపై సావధానంగా ప్రజాభిప్రాయము విన్నారు. ఈ సందర్బంగా డా.గంగులయ్య మాట్లాడుతూ గూడెం మండలం అన్ని రంగాల్లో వెనకబాటుకు గురౌతుంది. ఈ ప్రాంతం యువత బలంగా మార్పు కోరుకుంటుంది. గడిచిన 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మండల కేంద్రానికి సమీప గ్రామమైన గొడిచింతకు సరైన రహదారి సౌకర్యం లేదు మంచి సాగుభూమి ఉండీ నీరు సదుపాయం ఉన్నకూడా సాగునీటి కాలువ ఏర్పాటు లేదు. మాట్లాడితే గడప, గడప కి అంటున్న వైసీపీ నేతలు ప్రజాప్రతినిధులు గోడి చింత గ్రామ విషయంలో సమాధానం చెప్పాలి. ఓట్లు అడగడానికి వచ్చే నాయకులు ప్రజలు ఎక్కడ సమస్యలు ప్రస్తావిస్తారేమోనని కనిపించకుండా తిరుగుతున్నారు. రవాణా, మౌళికసధుపాయలు కల్పించడంలో గిరిజనులకు తీరని ద్రోహం చేస్తున్న ప్రభుత్వం మన అభివృద్ధిపై నిర్లక్ష్యం చేస్తుంది. స్వతంత్ర వీరుడు అల్లూరిసీతారామరాజు పోరాటం జరిపిన నేల ఇది, మనం అదే స్ఫూర్తితో ఈ ప్రభుత్వం కపట విధానాలతో పోరాడాలి. నాయకులకు నీతి, నిజాయితీ కావాలి. ప్రస్తుతం మన ప్రజాప్రతినిధుల్లో అవి మచ్చుకైనా కనపడదు. గిరిజన ప్రజలకు మంచి చేయలేని నాయకులు ఉన్నంతవరకు మన బ్రతుకుల్లో ఎటువంటి మార్పులేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం జీతాలు వేయలేనటువంటి దుస్థితి. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జి ఆడుకుంటారు తప్పితే నిర్వీర్యం అయిపోతున్న గిరిజన హక్కులు, చట్టాలు పరిరక్షించే బాధ్యత, తీరిక ఎక్కడిది సీఎం గారికి అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంత గిరిజనుల్లో కొత్త అలజడి ఏమిటంటే ప్రస్తుతం మన పీషా చట్టాల ఉల్లంఘన చేసి కడప కంపెనీలకు ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ధారాదత్తం చేస్తున్నారు. ఇటువంటి సూక్ష్మా రాజకీయాలను యువత ఆలోసించకపోతే జాతి నిర్వీర్యం కావడం ఖాయం. ఎలాగూ మన జాతి ప్రయోజనాలను కాపాడే దిశగా ఆలోచన చెయ్యరు. యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి మార్పుకోసం ఆలోచన చెయ్యాలని చెప్పారు. అలాగే పంట భూములకు ప్రధాన ఆనకట్ట, చెరువుకు ఎటువంటి పూడిక తీత పనులు చేయని కారణంగా గ్రామస్తులు తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని తెలపగా, చెరువును గంగులయ్య సందర్శించి పరిశీలించారు. ఈ సమావేశం విజయవంతానికి ముఖ్యకారణం సిద్ధు, బాలు మరికొంతమంది జనసైనికులకు ప్రత్యేకంగా అభినందించారు. చింతపల్లి మండల నాయకులు బుజ్జిబాబు, దేపురు రాజు, వాలంగి ఫునిత్, జి.మాడుగుల మండల నాయకులు మండల అధ్యక్షులుమసాడి భీమన్న, యూత్ అధ్యక్షులు మస్తాన్, భానుప్రసాద్, పాడేరు మండల నాయకులు సత్యనారాయణ, అశోక్, సంతోష్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.