కరెంట్ చార్జీల మోతతో పేద కుటుంబాలు కాలం వెళ్ళదీసేది ఎలా?

  • వైకాపా ప్రభుత్వం హయాంలో ఇప్పటివరకు 9సార్లు పెరిగిన కరెంట్ చార్జీలు
  • డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య గారు ఎమ్మెల్యేకి భజన చేయడం ఆపి డివిజన్ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అర్బన్ నియోజకవర్గం: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత సోమవారం మహిళలతో మాటమంతి కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 13వ డివిజన్ ఉమానగర్ లో పర్యటించి స్థానిక ప్రజలనుంచి పలు సమస్యలను తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ ఏఇంటికి వెళ్లినా ఏమహిళను అడిగిన వైకాపా ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచడం ద్వారా విపరీతంగా బిల్లులు వచ్చి లైట్ కానీ ఫంకా కానీ వేయలంటేనే భయంగా ఉందని ఈ జగన్ రెడ్డి ప్రజలను కరెంట్ ఉన్న పెరిగిన రేట్లతో ఉపయోగించుకునే పరిస్తితి లేక తిరిగి కరెంట్ లేని కాలానికి ప్రజలను తీసుకెళ్లాడని ఒక్క ఛాన్సు అని అధికారం కట్టపెడితే జీవితాలలో వెలుగులు లేకుండా చేసాడన్నారు.. దీనితో పాటు ఇక్కడ అనంతపురం నగర డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ డివిజన్ లో మురుగుకాలువలు అధ్వాన్నంగా ఉన్నాయని దీనికి తోడు మంచినీటి కొరతకుడా విపరీతంగా ఉందని సాహిత్య నువ్వు ఎమ్మెల్యే అన్నతవెంకట రామిరెడ్డికి భజన చేయడం అపేసి ఇప్పటికైనా డివిజన్ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.