రైనా మేనత్త కుటుంబo దాడి కేసులో నేరస్తుల అరెస్ట్

ఆగస్టు 19న అర్ధరాత్రి పంజాబ్ లో థర్యాల్ గ్రామంలో డాబా మీద నిద్రిస్తోన్న రైనా మేనత్త కుటుంబంపై దాడి జరిగింది. ఈ దాడిలో రైనా మేనత్త భర్త అశోక్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వారి కొడుకు కౌశల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మేనత్త ఆశారాణి ఇంకా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంది. విషయం తెలిసిన వెంటనే పీఎల్ 2020 కోసం దుబాయ్ వెళ్లిన రైనా అర్థంతరంగా ఇండియాకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. తన కుటుంబానికి జరిగిన దాడిలో దోషులను గుర్తించి శిక్షించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగా. ఆ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇకపోతే తాజాగా రైనా మేనత్త కుటుంబం పై దాడి సంఘటనపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్రకటన చేశారు. ఆ పని అంతరాష్ట్ర దొంగల ముఠా పని అని వారు పఠాన్‌కోట్ రైల్వే స్టేషన్ సమీపంలోని చిన్న గుడిసెల్లో నివసిస్తున్నారని, వారిలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో మరో 11మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని అన్నారు.

మూడు నాలుగు రోజుల పాటు పఠాన్ కోట్ గురించి బాగా తెలిసిన వారితో కలిసి రెక్కీ నిర్వహించామని, టెర్రస్ మీద వారు పడుకున్నది చూసి కర్రలతో తలలపై బాది చంపేశామని నిందితులు ఒప్పుకున్నారు. ఆ తర్వాత బంగారం, డబ్బు తీసుకొని. పారిపోయామని, అవన్నీ పంచుకున్నాక మళ్లీ ఒకర్ని ఒకరం కలుసుకోలేదని నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.