పల్లె సుబ్రమణ్యంను కలిసిన అతికారి దినేష్

రాజంపేట: నందలూరు మాజీ మండల ఆధ్యక్షులు మరియు మాజీ సర్పంచ్, మాజీ సౌమ్యనాథస్వామి ఆలయ ధర్మకర్త, క్లాస్ వన్ కాంట్రాక్టర్ పల్లె సుబ్రమణ్యం ఆహ్వానం మేర రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ వారి స్వగృహంలో పల్లె సుబ్రమణ్యం ను, వారి కుమారులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా అతికారి దినేష్ ను పల్లె సుబ్రమణ్యం ఆయన పెద్ద కుమారుడు పల్ల రెడ్డెయ్య శాలువాతో సత్కరించి శ్రీ సౌమ్యనాథస్వామి చిత్ర పటాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.