బెవరపేటలో జనసేన కార్యకర్తలపై దాడి అమానుషం: గురాన అయ్యలు

విజయనగరం, చీపురపల్లి నియోజకవర్గంలో బెవరపేటలో జనసేన కార్యకర్తలపై దాడి అమానుషమని జనసేన నాయకులు గురాన అయ్యలు అన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడం జరిగింది. జనసేన పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ జగనన్న భవిష్యత్తు స్టిక్కర్లు అంటించొద్దు అన్నందుకు జనసేన కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేయడం అమానుషమన్నారు. అధికార పార్టీ నాయకులు దాడులకు తెగబడి ప్రాణాలు హరించాలని చూడటం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. జనసేన పార్టీ శ్రేణులపై వైకాపా నాయకులు దాడులు చేస్తే సహించేది లేదన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, దాడిచేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖ నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కేసులు నమోదు చేయని పక్షంలో జనసేన పార్టీ చట్టబద్ధంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య రీతిలో అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ విలువల ప్రకారం పోరాటానికి సిద్దమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆదాడ మోహన్ రావు, రాజేంద్ర, ఎంటి రాజేష్, భార్గవ్, ఎమ్.పవన్ కుమార్, సురేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.