వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళల పై దాడులు ఎక్కువయ్యాయి: కీర్తన

పద్మావతి నగరానికి చెందిన చంచయ్య అనే వ్యక్తి జిమ్ ట్రైనర్ గా ఉంటూ.. అక్కడ ట్రైనింగ్ కు వచ్చిన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటూ వేధిస్తూ.. రెండు మూడు సార్లు కొట్టే ప్రయత్నం చేశాడు. ఎవరికైనా చెబితే నీ మీద దాడి చేస్తానంటూ బెదిరిస్తూ.. వేదించే వాడు.. చివరికి మంగళ వారం రాత్రి ఆ అమ్మయి తమ్ముడిని చంపడం జరిగింది. ఇంత వరకూ ఎవరికీ ఎందుకు చెప్పలేదని ఆ అమ్మాయిని అడుగగా.. మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు అందుకే కంప్లైంట్ లేక పోయాం అని చెప్పింది. ఇప్పటికైనా తిరుపతి మ్మెల్యే కావచ్చు అతని కొడుకు కావచ్చు.. స్పందించి ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి. అలాగే నేరస్తుడికి శిక్ష పడేలా చేయాలని తిరుపతి జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కీర్తన
డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళల పై దాడులు ఎక్కువయ్యాయని ఎద్దేవా చేశారు.