వైసీపీ పాలనలో అభివృద్ధికి చోటులేదు

  • జనసేన రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు

మూడేళ్ళ అధికారంలో మూడు కిలోమీటర్ల రోడ్డు కూడా వేయలేని స్థితిలో వైసీపీ పాలన కొనసాగుతోందని, అభివృద్ధి అనే పదమే వైసీపీ పరిపాలనా డిక్షనరీలో లేదని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయబాబు అన్నారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు బాలాజీ నగర్ లో దెబ్బతిన్న రోడ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కండేయ బాబు మాట్లాడుతూ అప్పుల్లో అగ్రస్థానంలోనూ అభివృద్ధిలో పాతాళంలోనూ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత జగన్ రెడ్డికే చెల్లిందన్నారు. నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ గతుకలమయంగా మారిన రోడ్లపై ప్రయాణిస్తున్న వారికి వెన్నుపూస దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ప్రమాదాల బారిన పడటంతో తీవ్ర గాయాల పాలు అవుతున్నారన్నారు . రోడ్లను ఎలాగూ వేయటం చేతకాదు కనీసం రోడ్ల మధ్యలో ఏర్పడ్డ గుంతలనన్నా పూడ్చాలని కోరారు. వైసీపీ నేతలు చేసిన ఆరు లక్షల కోట్లలో అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, మరి అంతడబ్బు ఏమైందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వైసీపీ నాయకులపై ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, దళిత నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు, నగర ఉపాడక్ష్యులు చింతా రాజు, ప్రధాన కార్యదర్శిలు యడ్ల మల్లి, విజయలక్ష్మి, ఉపేంద్ర, కార్యదర్సులు సూదా నాగరాజు, బండారు రవీంద్ర, తోట కార్తిక్, అరుణ, పుల్లంశెట్టి ఉదయ్, మిద్దె నాగరాజు, కిట్టూ, మెహబూబ్ బాషా, నాగేంద్ర సింగ్, జెబీవై నాయుడు, శీలం మోహన్, షార్ఫుద్దీన్, వడ్డె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.