గుంతకల్లు జనసేన ఆధ్వర్యంలో ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని ఆందోళన కార్యక్రమం

*గుంతకల్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేసిన గుంతకల్లు నియోజకవర్గం నాయకులు

అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ సూచన మేరకు అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ నేతృత్వంలో.. జగనన్న బాదుడే బాదుడు పథకం ద్వారా పెరిగి పోయిన ఆర్టీసీ బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆరికేరి జీవన్ కుమార్ మాట్లాడుతూ.. 2019 లో శ్రీ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం, మద్యం దుకాణాలు బంద్ చేస్తాం, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని
అక్కా ఒక ఛాన్స్.. అక్క అవ్వా ఒక ఛాన్స్ అని చెప్పి గెలిచి ఈ రోజు ఏంచేస్తునారు అయ్యా అంటే.. కరెంట్ ఛార్జీలు బాదుడే బాదుడు.. ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు.. నేడు గుంతకల్లు నుండి గుత్తికి రావాలి అంటే 80 రూపాయిలు.. ఎంత పెరిగింది అంటే 27 రూపాయిలు పెరిగింది.. ఇలా పెంచుకుంటూ పోతే, పేద మధ్య తరగతి ప్రజలు రోడ్డున పడతారు. మీరు పేద, మద్య తరగతి కుటుంబాల రక్తాన్ని పిండుతున్నారు. మీరు వెంటనే ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలి.. లేక పోతే ప్రజల తరపున జనసేన పార్టీ రానున్న రోజులలో బారి ఎతున ప్రజాఉద్యమం చేస్తుంది అని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో గుంతకల్లు జనసేన పార్టీ విర మహిళ విజయ, అనంతపురం జిల్లా కార్యనీర్వహన కమిటి సభ్యులు సొహైల్, క్రిష్ణ, శేకర్, గుంతకల్లు మండల అధ్యక్షులు పురుషోత్తం, గుంతకల్లు నాయకులు శేకర్, విరేష్, విజయ్, మారుతి, మహేష్, జీలాన్, రవి, సర్దార్, ఫిరోజ్, పాండు, ధాద్దు, శివ, వంశీ, రాజు కుమార్, గణేష్, హేమంత్, అరవింద్, లడు, రాకేష్, శసంక్, విజయ్, డ్షరాడ్, మని, రము, రాజు, శేంకేరైయ, రమేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.