16 నెలలు జైలులో ఉంటే అతన్ని ఖైదీ అంటారా ముఖ్యమంత్రి అంటారా..?: శివదత్ బోడపాటి

రాష్ట్ర రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ వ్యవస్థలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తాం అని చెప్పిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కులాన్ని తాకట్టు పెట్టినట్టా.. లేక కులం కార్డు పెట్టుకొని ఒక ఖైదీ కాళ్లు పట్టుకొని మంత్రి పదవులు తెచ్చుకున్న మీరు కాపు కులాన్ని తాకట్టు పెట్టినట్టా?.. రైతాంగాన్ని గాలికి వదిలేసిన మీది ఒక పరిపాలన అంటారా?.. అని పాయకరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి వైసీపీ ప్రభుత్వాన్ని బలంగా ప్రశ్నించారు.