ఆంధ్రప్రదేశ్లో పోలీసుల మనోభావాలు కాపాడాలి

రాష్ట్రంలో ఈరోజు సామాన్య వ్యక్తి దగ్గర నుండి ఖరీదైన వ్యక్తులు వరకు సమాజంలో రక్షణ కల్పిస్తున్న వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అలాంటి పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న పోలీసుల పైన మంత్రి అప్పలరాజు మాట్లాడిన మాటలు, బట్టలుఊడదీసికొడతానాకొడకా అనే అసభ్య పదజాలంతో తిట్టడం చాలా బాధాకరమైన సంఘటన, జరిగిన సంఘటనను జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ప్రజాప్రతినిధుల కోసం, ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్న వ్యవస్థ పోలీసు వ్యవస్థ అలాంటి పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ని, రాష్ట్ర డిజిపి ని కోరుకుంటూ మంత్రి అప్పలరాజు పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ శుక్రవారం గుంటూరు తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దార్ల మహేష్, గాదె లక్ష్మణ్ రావు, నాదెండ్ల రాము, మిద్దె నాగరాజు, లేల వెంకటేశ్వరరావు, పసుపులేటి నాని, జెట్టి వెంకటేశ్వరరావు చెవిటి గంటి జయ, గుంటూరు తూర్పు నియోజకవర్గం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.