ఇంటింటి కుళాయిల కోసం గ్రామ మహిళలతో ధర్నా చేసిన ఆగూరు మని

పార్వతీపురం, నర్సిపురం గ్రామంలో కుమ్మర వీధి, తెలకల వీధి మరియు చాకలి వీధిలో ఇంటింటి కుళాయిలు వేయిస్తామని చెప్పి ఇంతవరకు ఎటువంటి కదలకలేదు. ఆదివారం ఈ మూడు వీధులకు చెందిన మహిళలు ముఖ్యంగా కుమ్మరి వీధి చెందిన మహిళలు పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగూరు మని ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు ఆగూరు మని మాట్లాడుతూ ఈ సమస్యను వెంటనే నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే జోగారావు గారు ను కోరడం జరిగింది. ముఖ్యంగా కొన్ని వీధుల్లో జలజీవన్ పథకం ద్వారా ఇంటింటి కొళాయిలు వేస్తామని చెప్పి కొన్ని వీధుల్లో వేసి కొన్ని వీధుల్లో వేయడం మానేసిన అధికారులు కళ్ళు తెరవాలని కోరడం జరిగింది. ఇప్పటికైనా మహిళలు ఆగ్రహానికి గురికావద్దని మహిళల ఆగ్రహానికి గురైనట్లయితే ఎమ్మెల్యే జోగారావు గారికి బాగా తెలుసు అని చెప్పడం జరిగింది. అక్కడ కొంతమంది మహిళలు మాట్లాడుతూ వెంటనే మా సమస్య పరిష్కరించాలని లేనియెడల రోడ్డుపై బైఠాయించి రాస్తారోకా చేస్తామని చెప్పడం జరిగింది ఈ ఒక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఖాతా విశ్వేశ్వరరావు జనసేన వీర మహిళలు, నర్సిపురం గ్రామ మహిళలు పాల్గొనడం జరిగింది.